Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మల్కిజ్‌గూడ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నలుగురికి ఘన సన్మానం

Author admin | 16 Sep 2026, 09:42 PM |
మల్కిజ్‌గూడ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నలుగురికి ఘన సన్మానం

మల్కిజ్‌గూడ, సెప్టెంబర్ 16, మంచితనం న్యూస్:
మల్కిజ్‌గూడ గ్రామానికి చెందిన వడ్డెర సామాజిక వర్గంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ, ఉన్నత పదవులు చేపట్టిన నలుగురు ప్రముఖులను వడ్డెర కుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.

ఉద్యోగరీత్యా, రాజకీయంగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీ డేరంగుల జంగయ్య హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ మల్కాజిగిరి సొసైటీ డైరెక్టర్‌గా ఎన్నికైన సందర్భంగా, అలాగే మల్కిజ్‌గూడ గ్రామ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికైన శ్రీ డేరంగుల శంకర్ మండల సర్పంచ్‌ల ఫోరమ్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపారు.

అదేవిధంగా శ్రీ వరికుప్పల సుధాకర్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ స్టేట్ ఓబీసీ డిపార్ట్‌మెంట్ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా ఓబీసీ డిపార్ట్‌మెంట్ అబ్జర్వర్‌గా నియమితులైన సందర్భంగా, వడ్డెర సంఘం నాయకులు ఆయనను అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు గ్రామంలోని వడ్డెర సామాజిక వర్గానికి సేవలందిస్తూ, సంఘం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న వరికుప్పల (ధవాన్) వెంకటేష్ సేవలను గుర్తించి ఆయనను కూడా ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వడ్డెర కుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. మల్కిజ్‌గూడ గ్రామానికి చెందిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగడం గ్రామానికి, సమాజానికి గర్వకారణమని అన్నారు. ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని సమాజ అభివృద్ధికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డేరంగుల పాండు, వరికుప్పల ఈదయ్య, డేరంగుల స్వామి, డేరంగుల గణేష్, వరికుప్పల రామకృష్ణ, వరికుప్పల ప్రభాకర్, డేరంగుల రవి, వరికుప్పల రమేష్, వరికుప్పల వెంకటేష్, వరికుప్పల శ్రీశైలం తదితర కుల సంఘం నాయకులు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సన్మాన గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన సంఘం నాయకులు.. వారు భవిష్యత్తులో తమ తమ వృత్తి, సామాజిక, రాజకీయ రంగాల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి, వడ్డెర సామాజిక వర్గం అభ్యున్నతికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్