Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మల్కిజ్ గూడ గ్రామంలో బి.ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభం

Author admin | 21 Jun 2026, 06:37 PM |
మల్కిజ్ గూడ గ్రామంలో బి.ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభం

మల్కిజ్ గూడ గ్రామంలో బి.ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభం
యాచారం మండలంలోని మల్కిజ్ గూడ గ్రామంలో బి.ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను బి.ఆర్.ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ బూడిద రామిరెడ్డి గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ బూడిద రామిరెడ్డి గారు మాట్లాడుతూ, గ్రామంలో ఇప్పటివరకు వాటర్ ఫిల్టర్ సౌకర్యం లేకపోవడంతో గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా గ్రామానికి మరో వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను కూడా అందజేస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా గ్రామపంచాయతీలో జరిగే గ్రామసభ సమావేశాల్లో ప్రజలు కూర్చోవడానికి అవసరమైన కుర్చీలను అందజేస్తానని, కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు కూడా అందిస్తానని తెలిపారు. గ్రామానికి ఎలాంటి అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత మేర సహకరిస్తానని చెప్పారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడుస్తూ గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు బట్టతో తయారుచేసిన చేతి సంచులను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ యువతకు టీ-షర్టులను అందజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని కోరారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీ డేరంగుల శంకర్ గారు మాట్లాడుతూ, గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయడమే కాకుండా మరో ప్లాంట్‌ను కూడా అందజేస్తానని హామీ ఇవ్వడం, గ్రామపంచాయతీకి కుర్చీలు, మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తానని ప్రకటించడం పట్ల గ్రామ ప్రజల తరఫున బి.ఆర్.ఆర్ ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డ్రగ్స్ నిర్మూలన, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు.
వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటుకు తన ఇంటి స్థలాన్ని అందించిన శ్రీ పల్లెర్ల లింగారెడ్డి గారికి బూడిద రామిరెడ్డి గారు మరియు సర్పంచ్ శంకర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని బి.ఆర్.ఆర్ ఫౌండేషన్‌కు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

మల్కిజ్ గూడ గ్రామంలో బి.ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభం - Additional Image
అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్