Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

Author admin | 31 Aug 2026, 10:18 PM |
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోంది: బీజేపీ రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం

ఇబ్రహీంపట్నం:
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు నిట్టు శ్రీశైలం అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కార్యాలయం కాదని, తెలంగాణలో కోట్లాది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అలాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలపై దాడి చేయడమేనని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకం, దౌర్జన్యం పెరిగిపోయాయని నిట్టు శ్రీశైలం ఆరోపించారు. ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రశ్నించే గొంతులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక, రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమేనని, అయితే భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిట్టు శ్రీశైలం డిమాండ్ చేశారు.

ఇలాంటి దాడులు, బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని ఆయన స్పష్టం చేశారు. “బీజేపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ఎవరి వల్లా సాధ్యం కాదు. ఒక్కో కార్యకర్త వెయ్యి మందిగా మారి కాంగ్రెస్ దౌర్జన్యాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో తిప్పికొడతాం” అని నిట్టు శ్రీశైలం అన్నారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్