బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోంది: బీజేపీ రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం ఇబ్రహీంపట్నం: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు నిట్టు శ్రీశైలం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కార్యాలయం కాదని, తెలంగాణలో కోట్లాది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అలాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలపై దాడి చేయడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకం, దౌర్జన్యం పెరిగిపోయాయని నిట్టు శ్రీశైలం ఆరోపించారు. ప్రభుత్వాన్ని,...