Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ప్రశాంత్ హిల్స్ డివిజన్ 58 యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరికుప్పల శివ నియామకం

Author admin | 28 Aug 2026, 09:32 AM |
ప్రశాంత్ హిల్స్ డివిజన్ 58 యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరికుప్పల శివ నియామకం

పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన శివ సేవలను గుర్తించిన అధిష్టానం

మహేశ్వరం: GHMC పరిధిలోని 58వ డివిజన్ ప్రశాంత్ హిల్స్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరికుప్పల శివ నియమితులయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వరికుప్పల శివను పార్టీ అధిష్టానం గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.

ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 58వ డివిజన్‌లో యువతను కాంగ్రెస్ పార్టీ వైపు మరింతగా ఆకర్షిస్తూ, యువజన సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శివ కీలకంగా పనిచేయాలని పార్టీ నాయకత్వం ఆకాంక్షించింది.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వరికుప్పల శివ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ, పార్టీ కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. డివిజన్‌లో యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేసి, పెద్ద సంఖ్యలో యువతను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేస్తానని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తన నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి అన్నగారికి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ సంతోష్ గౌడ్ అన్నగారికి, మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు సుభాన్ యాదవ్ గారికి, స్టేట్ సెక్రటరీ సామిడి చరణ్ రెడ్డి గారికి శివ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే తన రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జ్ KLR సార్ గారికి, తెలంగాణ పీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి అన్నగారికి, తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తనకు ఎల్లప్పుడూ సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులందరికీ వరికుప్పల శివ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని, 58వ డివిజన్‌లో యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు.

వరికుప్పల శివకు యువజన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు దక్కడంపై డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్