ప్రశాంత్ హిల్స్ డివిజన్ 58 యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరికుప్పల శివ నియామకం

పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన శివ సేవలను గుర్తించిన అధిష్టానం మహేశ్వరం: GHMC పరిధిలోని 58వ డివిజన్ ప్రశాంత్ హిల్స్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరికుప్పల శివ నియమితులయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వరికుప్పల శివను పార్టీ అధిష్టానం గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 58వ డివిజన్‌లో యువతను కాంగ్రెస్ పార్టీ వైపు మరింతగా ఆకర్షిస్తూ, యువజన సమస్యల పరిష్కారానికి...