Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడు: దేప భాస్కర్ రెడ్డి

Author admin | 20 Aug 2026, 07:27 PM |
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడు: దేప భాస్కర్ రెడ్డి

మహేశ్వరం: భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్, ప్రశాంత్ హిల్స్ 58వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, యువతకు అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషించిన దూరదృష్టి కలిగిన నాయకుడని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ ఇన్‌చార్జి, కోఆర్డినేటర్ ధరవత్ స్వామి నాయక్తో పాటు కంటెస్టెంట్ కార్పొరేటర్లు, ఎక్స్‌-కోఆప్షన్ సభ్యులు, కమిటీ ఇన్‌చార్జిలు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు, జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్