మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడు: దేప భాస్కర్ రెడ్డి

మహేశ్వరం: భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్, ప్రశాంత్ హిల్స్ 58వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, యువతకు అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషించిన దూరదృష్టి కలిగిన నాయకుడని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత...