Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు.. ఎండిపోతున్న పంటలు!

Author admin | 31 Oct 2026, 02:01 PM |
కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు.. ఎండిపోతున్న పంటలు!

సాగునీరు, విద్యుత్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు – మంచిరెడ్డి కిషన్ రెడ్డి

మల్కీజ్ గూడ: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం యాచారం మండలం మల్కీజ్ గూడ గ్రామంలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించి, పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే రైతు తన కష్టాలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అప్పులు చేసి, అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి పంట సాగు చేశామని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ల ద్వారా నీరు అందించి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తరచూ విద్యుత్ కోతలు, విద్యుత్ సమస్యల కారణంగా మోటార్లు సైతం మరమ్మతులకు గురవుతున్నాయని వివరించారు.

ఇవి కూడా చదవండి

గతంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి, సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరాతో వ్యవసాయానికి భరోసా కల్పించిందని రైతు గుర్తుచేశారు.

అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, సాగునీరు మరియు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా యాచారం మండల కేంద్రంలోని 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌ను పరిశీలించి విద్యుత్ కోతల సమయాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

స్థానిక ఎమ్మెల్యే రైతుల సమస్యలపై కనీసం ఒక్కసారైనా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రైతులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్