నీట్ పీజీలో భావనారెడ్డి ప్రభంజనం!
నీట్ పీజీలో భావనారెడ్డి ప్రభంజనం! • ఆల్ ఇండియా స్థాయిలో 1542వ ర్యాంకు.. రాష్ట్రస్థాయిలో 52వ స్థానం • 560 మార్కులతో సత్తా.. డెర్మటాలజీ పీజీ సీటే లక్ష్యంగా ముందడుగు కుషాయిగూడ, అక్టోబర్ 12. మంచితనం న్యూస్:-ప్రతినిధి గోపగాని పాండు. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పీజీ–2026 ప్రవేశ పరీక్షలో చర్లపల్లి డివిజన్ చక్రిపురం రెడ్డి కాలనీకి చెందిన డాక్టర్ కట్కూరి భావనారెడ్డి విశేష ప్రతిభ కనబరిచారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదలతో పరీక్షకు సిద్ధమైన ఆమె 560 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 1542వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 52వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. భావనారెడ్డి సాధించిన ఈ విజయం కుటుంబ...