కవిత గౌరవానికి భంగం.. న్యాయం చేయాలంటూ ఫిర్యాదు

• కానిస్టేబుల్ అనిల్ వ్యాఖ్యలపై విచారణ జరపాలి.. నేతల డిమాండ్ • మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేసిన నాయకులు మల్కాజిగిరి, సెప్టెంబర్ 02, మంచితనం న్యూస్: కల్వకుంట్ల కవితపై అనుచితంగా, అవమానకరమైన పదజాలంతో మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ అనిల్‌పై నిష్పక్షపాత విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మల్కాజిగిరి సీనియర్ నాయకుడు మద్దాలి సాయికుమార్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా మహిళల పట్ల అవమానకరమైన భాషను ఉపయోగించడం సమాజానికి ఏమాత్రం సమంజసం కాదని నాయకులు పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మరింత సంయమనంతో, గౌరవప్రదంగా...