చట్టపరమైన విముక్తితో పాటు సామాజిక, ఆర్థిక విముక్తి సాధించాలి
సంచార–విముక్త జాతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: వరికుప్పల సుధాకర్ రంగారెడ్డి, ఆగస్టు 31: సంచార–విముక్త జాతులకు చట్టపరంగా విముక్తి లభించినప్పటికీ, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సంపూర్ణ విముక్తి సాధించే వరకు పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉందని వడ్డెర సంగం రాష్ట్ర నాయకులు, టీపీసీసీ స్టేట్ అబ్సర్వర్ (ఓబీసీ డిపార్ట్మెంట్) వరికుప్పల సుధాకర్ అన్నారు. సంచార–విముక్త జాతుల 75వ విముక్తి దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సంచార–విముక్త జాతుల సమస్యలు, హక్కులు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక...