నేడు యాచారంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మండల స్థాయి సమీక్ష
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు యాచారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే మండల స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్రంగా సమీక్షించనున్నారు. సమావేశానికి సంబంధిత అన్ని శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాచారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొటే శ్రీశైలం ఒక ప్రకటనలో కోరారు.