ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత యాచారం: ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్‌రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారునికి అందజేశారు. మొహమ్మద్ రజాక్ గారికి మంజూరైన రూ.28,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోటె శ్రీశైలం, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నీలం రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ...