బీఆర్‌ఎస్‌ నేతలకు యువత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు:

బీఆర్‌ఎస్‌ నేతలకు యువత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: టీపీసీసీ ఓబీసీ విభాగం స్టేట్ కోఆర్డినేటర్ వరికుప్పల సుధాకర్ హైదరాబాద్‌: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన యువ సంగ్రామ సభలో ఆ పార్టీ నాయకులు యువత, నిరుద్యోగ సమస్యలపై మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీపీసీసీ (ఓబీసీ విభాగం) స్టేట్ కోఆర్డినేటర్ వరికుప్పల సుధాకర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో యువత, నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యలకు బీఆర్‌ఎస్‌ నాయకులు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని, ఉద్యోగ నోటిఫికేషన్లలో ఎందుకు...