ఓటు హక్కు పరిరక్షణకు SIR కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వరికుప్పల సుధాకర్

ఓటు హక్కు పరిరక్షణకు SIR కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వరికుప్పల సుధాకర్ యాచారం, జూలై 15: ఓటు హక్కు ప్రతి భారత పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటంలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని టీపీసీసీ ఓబీసీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ వరికుప్పల సుధాకర్ అన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండలం, మల్కిజ్‌గూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ బీఎల్ఓ (గ్రామ సెక్రటరీ), కారోబార్‌లతో కలిసి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన నమోదులను ఎన్యూమరేషన్ ఫారంలో పూర్తి చేసి, వాటి ధ్రువీకరణతో పాటు...