మల్కీజ్‌గూడ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
మల్కీజ్‌గూడ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్‌గూడ గ్రామంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఆరోగ్య శాఖ సిబ్బంది పోలియో చుక్కలు వేయించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించడంతో కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. గ్రామ ప్రజలు ఆరోగ్య శాఖకు సహకరించి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. దేశం పోలియో రహితంగా కొనసాగేందుకు ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా...