🏠 manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 14 October 2026, 07:38 AM Posted by: admin

65వ ఉర్సు-ఎ-ముబారక్ వేడుకలు ఘనంగా నిర్వహణ

65వ ఉర్సు-ఎ-ముబారక్ వేడుకలు ఘనంగా నిర్వహణ

అతిథిగా పాల్గొన్న కునా శ్రీశైలం గౌడ్
అక్టోబర్ 13: దర్గా హజ్రత్ సయ్యద్ ఫైజుద్దీన్ షా ఖాద్రీ (ర.అ.) వారి 65వ ఉర్సు-ఎ-ముబారక్ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. అక్టోబర్ 12న సందల్ ముబారక్ కార్యక్రమం, జల్సా-ఎ-ఔలియా అల్లాహ్ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఇషా నమాజ్ తర్వాత సందల్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కునా శ్రీశైలం గౌడ్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ముతవల్లి సజ్జాదా నషీన్ జనాబ్ అల్ హాజ్ సయ్యద్ ఖాజా ఖాద్రీ సాహెబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ సదర్ ఖాజీ జనాబ్ మహమ్మద్ అబ్దుల్ రషీద్ సూఫీ సాహెబ్, అడ్వకేట్ సదర్ ఖాజీ జనాబ్ మహమ్మద్ అబ్దుల్ నూర్ సూఫీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
ఉర్సు వేడుకల్లో భాగంగా అక్టోబర్ 13వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లంగర్ ముబారక్ (అన్నదాన కార్యక్రమం) నిర్వహించారు. సాయంత్రం మగ్రిబ్ నమాజ్ అనంతరం చిరాగాహ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఉత్సవాల్లో పలువురు మతపెద్దలు, ముస్లిం సోదరులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఉర్సు వేడుకలను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సర్వమత సౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యం వెల్లివిరిశాయి.
🏠 Home