🏠 manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 09 October 2026, 02:21 PM Posted by: admin

ఎమ్మెల్యేపై దుష్ప్రచారం మానుకోవాలి


యాచారం మండల కాంగ్రెస్ పార్టీ మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ యాదవ్ హెచ్చరిక

యాచారం, అక్టోబర్ 09: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బస్సులో ప్రయాణిస్తూ ప్రజలతో మాట్లాడిన దృశ్యాలను కొంతమంది వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరికాదని యాచారం మండల కాంగ్రెస్ పార్టీ మాజీ వైస్ ఎంపీపీ గజ్జి రామకృష్ణ యాదవ్ అన్నారు.

అక్టోబర్ 6న కలెక్టరేట్‌లో కార్యక్రమం ముగిసిన అనంతరం బొంగ్లూర్ గేటు వద్ద ప్రయాణికుల కష్టసుఖాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో తన కూతురితో సమానమైన వయస్సు గల యువతితో ఎమ్మెల్యే మాట్లాడిన దృశ్యాలను వక్రీకరించి ట్రోలింగ్ చేయడం తగదని పేర్కొన్నారు.

రాజకీయ విమర్శలు చేయడానికి సరైన అంశాలు లేకపోవడంతోనే కొందరు ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారని గజ్జి రామకృష్ణ యాదవ్ విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.

ఎలాంటి మచ్చలేని తమ నాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ప్రచారాలను కొనసాగిస్తే నియోజకవర్గ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాల ఆధారంగా ఉండాలని గజ్జి రామకృష్ణ యాదవ్ సూచించారు.
🏠 Home