🏠 manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 09 September 2026, 12:10 PM Posted by: admin

తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం గౌరవ సలహాదారుగా మచ్చ పాండు గౌడ్

తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం గౌరవ సలహాదారుగా మచ్చ పాండు గౌడ్


తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర గౌరవ సలహాదారుగా మచ్చ పాండు గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కమిటీలో కీలకమైన బాధ్యతను అప్పగించిన ఫోరం గౌరవ అధ్యక్షులు నాగబెల్లి మహేష్‌తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామస్థాయిలో పనిచేస్తున్న వార్డ్ మెంబర్లకు పాండు గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డ్ మెంబర్లు గ్రామస్థాయిలో ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సమస్యలు, హక్కులు, గౌరవం, అధికారాల విషయంలో తగిన స్థాయిలో గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందన్నారు. వార్డ్ మెంబర్ల సమస్యలను సమష్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కుల సాధనకు ప్రజాస్వామ్య పద్ధతిలో బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వార్డ్ మెంబర్ల సంక్షేమం, హక్కులు, గౌరవం కోసం ఫోరం చేపట్టిన కార్యక్రమాలను మరింత క్రమశిక్షణతో, ఐక్యతతో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పాండు గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా నుంచి వార్డ్ మెంబర్లు ఒకే వేదికపై ఐక్యంగా నిలిచి తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
పదవి అనేది కేవలం గౌరవం మాత్రమే కాదని, ప్రజలకు మరియు వార్డ్ మెంబర్లకు సేవ చేసే బాధ్యత కూడా అని ఆయన అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో నిర్వర్తిస్తానని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా వార్డ్ మెంబర్ల సంక్షేమం, హక్కులు, గౌరవం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.ఫోరం నాయకత్వంతో సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. వార్డ్ మెంబర్ల సమస్యలను కేవలం వ్యక్తిగత సమస్యలుగా కాకుండా, గ్రామీణ స్థానిక పాలనకు సంబంధించిన కీలక అంశాలుగా పరిగణించి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలోని వార్డ్ మెంబర్లందరూ పార్టీలకు, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని పాండు గౌడ్ కోరారు. ఫోరం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి స్థాయిలో నాయకత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఫోరం గౌరవ అధ్యక్షులు నాగబెల్లి జ్యోతి మహేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన పాండు గౌడ్, రాష్ట్రవ్యాప్తంగా వార్డ్ మెంబర్స్ ఫోరాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.“మన ప్రయాణం న్యాయం కోసం.. మన పోరాటం ధర్మం కోసం.. మన లక్ష్యం వార్డ్ మెంబర్ల హక్కుల సాధన కోసం” అనే సంకల్పంతో ఐక్యంగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు.
🏠 Home