🏠 manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 22 July 2026, 05:20 PM Posted by: admin

యాచారం సర్పంచ్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా డేరంగుల శంకర్



యాచారం సర్పంచ్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా డేరంగుల శంకర్

యాచారం: యాచారం మండల సర్పంచ్ ఫోరం మండల కార్యవర్గాన్ని బుధవారం మేడిపల్లిలో నిర్వహించిన సర్పంచ్‌ల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మల్కీజ్‌గూడ గ్రామానికి చెందిన డేరంగుల శంకర్‌ను యాచారం మండల సర్పంచ్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా కొర్ర అరవింద్ నాయక్ (మంతన్ గౌరెల్లి) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నీలం శ్రీవిద్య (కురుమిద్ద), అంబోజి రమేష్ (తులేకుర్ద్), గౌరవ అధ్యక్షులుగా ముచ్చర్ల సుగుణ సంపత్ (నకర్త మేడిపల్లి) ఎన్నికయ్యారు.

కార్యదర్శులుగా బోడ కృష్ణ (సింగారం), కిషన్ నాయక్ (నల్లవెల్లి), కోశాధికారిగా రమేష్ నాయక్ (కేసీ తండా), సహాయ కార్యదర్శిగా తొట్ట రమేష్ (చింతపట్ల) ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా **అనిత శరణం (యాచారం), ఝాన్సీ రమేష్ (తాడిపత్రి), చైతన్య రాజు (నానక్‌నగర్), వెన్నెల శేఖర్ (కొత్తపల్లి)**లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డేరంగుల శంకర్‌కు పలువురు సర్పంచ్‌లు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు విజయకుమార్, బెల్లీ అశోక్, నక్క అలివేలు వెంకటేష్, రాజు, మంగా జంగయ్య, కౌసల్య జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home