మాల్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
యాచారం: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్‌రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో ప్రజా పాలనలో భాగంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా యాచారం మండలం మాల్ గ్రామానికి చెందిన మందడి జంగారెడ్డి, తండ్రి లింగారెడ్డికి ₹60,000, యెస్కుల్ల రాములయ్య, తండ్రి మైసయ్యకు ₹38,000 చొప్పున మంజూరైన మొత్తం ₹98,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మోటె శ్రీశైలం, మాల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ దొంతమోని శ్రీకాంత్ గౌడ్ సంయుక్తంగా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు. ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తూ ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కవిత శేఖర్, మాజీ సర్పంచ్ పద్మ జంగీర్, సీనియర్ నాయకులు లిక్కీ రాజారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గెణమోని గోపాల్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొలమోని రామకృష్ణ యాదవ్, యాచారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జయప్రకాష్ (జగన్), మాల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దేరంగుల రమేష్, గిరి గాలయ్య, మాస బాలరాజ్, మాజీ 4వ వార్డు సభ్యులు దేరంగుల్లా కృష్ణ, అండేకర్ రవి, షెల్లీ దేవధర్, గుండంట్ల కృష్ణ, దేరంగుల్లా ఈశ్వర్, ఆడాల శ్రీకాంత్, బన్నె జంగయ్యతో పాటు గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.