బీఆర్‌ఎస్ నేతలకు యువత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు:
టీపీసీసీ ఓబీసీ విభాగం స్టేట్ కోఆర్డినేటర్ వరికుప్పల సుధాకర్
హైదరాబాద్: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన యువ సంగ్రామ సభలో ఆ పార్టీ నాయకులు యువత, నిరుద్యోగ సమస్యలపై మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీపీసీసీ (ఓబీసీ విభాగం) స్టేట్ కోఆర్డినేటర్ వరికుప్పల సుధాకర్ విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో యువత, నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యలకు బీఆర్‌ఎస్ నాయకులు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని, ఉద్యోగ నోటిఫికేషన్లలో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించారు. పోటీ పరీక్షల నిర్వహణలో వివాదాలు ఎందుకు తలెత్తాయో కూడా బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనను తెలంగాణ యువత, నిరుద్యోగులు ఎప్పటికీ మర్చిపోలేదని సుధాకర్ అన్నారు. గ్రూప్-1తో సహా పలు నియామక పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడటంతో వేలాది మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈరోజు యువత కోసం పోరాడుతున్నామని చెబుతున్న బీఆర్‌ఎస్ నాయకులు ముందుగా అప్పట్లో నష్టపోయిన నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పడంతో పాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
యువతను రోడ్డుపైకి తీసుకువచ్చే ముందు బీఆర్‌ఎస్ నాయకులు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ నాయకులకు యువత సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందని సుధాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్, డీఎస్సీ, వైద్య, గురుకుల విద్యాసంస్థలు తదితర శాఖల్లో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టి వేలాది కుటుంబాల్లో ఆశలు నింపిందని పేర్కొన్నారు.
ఇంకా ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని, టీజీపీఎస్సీ ద్వారా మరో 450 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. త్వరలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు.
యువతకు కావాల్సింది రాజకీయ నినాదాలు కాదని, నమ్మకమైన వ్యవస్థ, పరీక్షల్లో పారదర్శకత, ఉద్యోగ అవకాశాలని వరికుప్పల సుధాకర్ అన్నారు. యువత ఉద్యోగ కలలను సాకారం చేసే దిశగా నియామకాల వేగాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, నిరుద్యోగులు మరియు యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.