ఓటు హక్కు పరిరక్షణకు SIR కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వరికుప్పల సుధాకర్
యాచారం, జూలై 15: ఓటు హక్కు ప్రతి భారత పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటంలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని టీపీసీసీ ఓబీసీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ వరికుప్పల సుధాకర్ అన్నారు.
భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండలం, మల్కిజ్‌గూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ బీఎల్ఓ (గ్రామ సెక్రటరీ), కారోబార్‌లతో కలిసి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన నమోదులను ఎన్యూమరేషన్ ఫారంలో పూర్తి చేసి, వాటి ధ్రువీకరణతో పాటు ఆన్‌లైన్ ప్రక్రియలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరికుప్పల సుధాకర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ గడువు ముగిసేలోపు తమ వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని కోరారు. సమయం దగ్గరపడుతున్నందున ఆలస్యం చేయకుండా సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి లేదా ఎన్నికల సంఘం సూచించిన విధంగా ఆన్‌లైన్‌లో SIR ఫారాన్ని నింపి తమ ఓటు హక్కును భద్రపరచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు విలువైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఈ ప్రక్రియలో బాధ్యతగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.