అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: ఎస్ఎఫ్ఎ
చలో సెక్రటేరియటకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు
ప్రజాస్వామ్యానికి మచ్చ: ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యదర్శి ఏర్పుల తరంగ్
ఇబ్రహీంపట్నం:
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలను అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఎ ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యదర్శి ఏర్పుల తరంగ్ అన్నారు. మంగళవారం చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ´ వెళ్లకుండా తనను తెల్లవారుజామునే ముందస్తుగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఎస్ఎఫ్ఎ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్బంధ రాజకీయాలను వీడి విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఎ మరింత బలంగా ఉద్యమిస్తుందని, ఎలాంటి బెదిరింపులు, అక్రమ అరెస్టులకు భయపడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయకులు రంజిత్, మనోహర్