🏠 manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 15 July 2026, 07:44 AM Posted by: admin

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ కుట్ర – ఏబీవీపి

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ కుట్ర – ఏబీవీపి

రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలోనీ యూనివర్సిటీలు బిటెక్ కళాశాలల ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ బంద్ విజయవంతం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వీరపట్టం జిల్లాలోని అన్ని యూనివర్సిటీలు, డిగ్రీ మరియు జూనియర్ కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ *ఏబీవీపీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ పయ్యంశెట్టి జగదీష్ పటేల్ * రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలపై ఆధారపడి ఉన్నారని. అయితే ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని*ఆరోపించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి సంవత్సరం *సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని*, **4.5 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని** తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించిన వారు, ఎన్నికల సమయంలో **బకాయిలన్నీ చెల్లిస్తామని, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల ఫీజులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి**, విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు బకాయిలను విడుదల చేయలేదని, ఈ అంశం న్యాయస్థానం దృష్టికి కూడా వెళ్లిందని పేర్కొన్నారు.

ప్రైవేట్ కళాశాలలు–ప్రభుత్వం మధ్య జరుగుతున్న నిర్లక్ష్య ధోరణిలో విద్యార్థులే బలవుతున్నారని, బడ్జెట్ లేక అనేక కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందని, ఉపాధి కోసం లెక్చరర్లుగా పనిచేస్తున్న నిరుద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. **ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విద్యార్థుల హక్కు తప్ప ప్రభుత్వం ఇచ్చే బిక్ష కాదని** స్పష్టం చేశారు.

రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీచార్జీలు, అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ఉద్యమ వేదికలుగా మార్చి పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ రుద్రపల్లి మహేందర్ ఢిల్లీ భాను స్టేట్ టెక్నికల్ సెల్ కో కన్వీనర్ వి చింతల గుణవంత్ రెడ్డి స్టేట్ ఎస్ఎఫ్ఐ కో కన్వీనర్ పుప్పాల ఆదర్శ్ పటేల్ జిల్లా టెక్నికల్ శివా , కార్తీక్, నాని, భరత్ వంశీ, వంశీ , నవదీప్, విగ్నేష్ , చరణ్, ప్రేమ్ రాజ్ ,ప్రమోద్ రాజ్, తదితరులు పాల్గొన్నారు
🏠 Home